Thursday, 5 April 2012

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం 31 (with Audio)


1-31

శ్లోకం


పిచ్ఛావతంసరచనోచితకేశపాశే  పీనస్తనీ నయనపంకజపూజనీయే


చంద్రారవింద విజయోద్యతవక్త్రబిమ్బే  చాపల్యమేతి నయనం తవ శైశవే నః .




ఓ బాలకృష్ణా! నీ రూపమూ, అలంకారమూ ఎంతో సుకుమారం గానూ, మనోహరంగానూ ఉన్నాయి. నీ జుట్టుముడి అందమైన నెమలి పింఛానికి తగినస్థానమే.  నీ రూపం నిండు యవ్వనంలో ఉన్న గోపయువతుల పద్మాల వంటి కన్నులతో పూజింపబడటానికి తగి ఉన్నది.  నీ గుండ్రని ముఖము చంద్రునితోనూ, పద్మాలతోనూ పోటీ పడి గెలుపుసాధించటానికి సమర్ధమై ఉన్నది. బాల్యచాపల్యం ఉట్టి పడే నీ మోహనరూపాన్ని చూడటానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది..

2 comments:

  1. హరి గారు,
    మీకు వేనవేల ధన్యవాదాలు. ఇన్నాళ్ళకు ఇలా శ్రీకృష్ణకర్ణామృతం తెలుసుకునే భాగ్యం కలిగింది.
    మీ కుసుమ కథ కూడా చదివాను. చాలా బాగా వ్రాశారు.
    అభినందనలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి

    ReplyDelete